calender_icon.png 30 August, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫెన్స్ భూములపై నివేదిక ఇవ్వండి

30-08-2025 12:29:33 AM

  1. జిల్లా కలెక్ట్ హరిచందన
  2. రక్షణ భూములపై ఎమ్మెల్యేలు, ఎమ్మెలీతో సమీక్ష

హైదరాబాద్ సిటిబ్యూరో ఆగస్టు 29 (విజయక్రాంతి): జిల్లా పరిధిలోని డిఫెన్స్ భూముల్లో ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదల సమస్యల పరిష్కారం దిశగా హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. ఆయా భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్, నాంపల్లి ఎమ్మెల్యేలు కౌసర్ మోహినుద్దీన్,  మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌లతో కలిసి కలెక్టర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఆసిఫ్ నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్‌పేట్ మండలాల్లో గుర్తించిన రక్షణ శాఖ భూములపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిం చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రక్షణ భూముల్లో నిరుపేదలు నివాసముంటున్నందున, వారి సమస్యను పరి ష్కరిం చేందుకు ప్రభుత్వం 2022లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  క్షేత్రస్థాయి నివేది కలు అందిన వెంటనే సంబంధిత భూములపై రక్షణ శాఖ అధికారులతో చర్చించి, తదుపరి చర్యలు చేపడతామని ఆమె తెలిపారు.

ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి దరఖాస్తులు అందాయని, రెవెన్యూ నివేదిక అందిన తర్వాత భూముల విలువను ల్యాం డ్ వా ల్యుయేషన్ నిర్ధారిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తదుపరి ఆదేశాల మేర కు పేదలకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయి రాం, పర్యవేక్షకులు ప్రవీణ్ కుమార్, సంబంధిత తహసీల్దార్లు, ఇతర అధికార్లు పాల్గొన్నారు.