calender_icon.png 2 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నామినేషన్ల ఘట్టం ముగింపు

02-12-2025 01:20:23 AM

  1. రెండో విడతలోనూ జోరుగా నామినేషన్లు
  2. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండవ రోజు అయిన సోమవారం నామినేషన్లు భారీగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గం లోని సారంగాపూర్ దిల్వార్పూర్ నర్సాపూర్ కుంటాల తదితర మండలాల్లోని 136 గ్రామపంచాయతీలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.

ఎన్నికలు పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు ఆయా నామినేషన్ కేంద్రాల్లో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేశారు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్డిఓ రత్నా కళ్యాణి డిపిఓ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించి నామినేషన్ల దాఖల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

రెండో విడత నామినేషన్ల ఘట్టం మంగళవారం ముగియను నేపథ్యంలో చివరి రోజు ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గజానన్ తాసిల్దార్ ప్రభాకర్ అధికారులు ఉన్నారు.

ఎన్నికల కోడ్ అమలు చేయాలి

బేల, డిసెంబర్ 1 (విజయక్రాంతి):  ఎన్నికల కోడ్ ను పకడ్బందీ అమలు చేయాలి ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ  ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగానే బేల, సాత్నాల, తాంసి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన సందర్శించారు.

ఎన్నికల ప్రక్రియను పరిశీలించి, విధులు నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారుల పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. నామినేషన్ వేసే అభ్యర్థులతో పాటు ఇద్దరు ప్రతిపాదికలు మా త్రమే లోనికి అనుమతించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకట రాజు, మోహన్ రెడ్డి, తహసిల్దార్ లక్ష్మీ, ఎస్.ఐ జీవన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ప్రీతం, పంచాయతీ కార్యద ర్శులు, తదితరులు ఉన్నారు.

అప్రమత్తంగా వ్యవహరించాలి

నస్పూర్, డిసెంబర్ 1 : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిం చాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారి శంకర్ లతో కలిసి 1వ విడత, 3వ విడత స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని, నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, ఏర్పాట్ల పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, సిబ్బందికి ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించాలన్నారు.

నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల ఎంపిక, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ సమయంలో పాటించవలసిన నియమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమ యంలో నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు హరి ప్రసాద్, మధు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.