calender_icon.png 16 November, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో పనిచేయాలి

01-12-2024 03:38:03 AM

రాచకొండ సీపీ సుధీర్‌బాబు

ఎల్బీనగర్, నవంబర్ 30: నూతన కానిస్టేబుళ్లు అంకితభావంతో పనిచేసి, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఉద్భోదించారు. నాగోల్‌లోని పీఎంఆర్ ఫంక్షన్‌హాల్ శనివారం నూతన కానిస్టేబుళ్లకు సీపీ సుధీర్‌బాబు దిశానిర్దేశం చేశారు. రాచకొండ పోలీస్ కమిషరేట్ నుంచి సివిల్ 265, ఏఆర్ 466 మొత్తం 731 కానిస్టేబుళ్లు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు.

వీరిని వివిధ పోలీస్‌స్టేషన్లకు కేటాయించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవ చేయాలన్నారు. నూతన కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులనుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీఇచ్చారు. మిగిలిన ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖ అత్యంత కఠినమైందని, పోలీసుల జీవితం ప్రతిక్షణం సవాళ్లతో కూడుకొని ఉంటుందన్నారు.

సవాళ్లను ఎదుర్కొని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ క్రమశిక్షణతో పని చేయాలన్నారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.