calender_icon.png 27 August, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టైల్ ఎక్సలెన్స్.. మాళవికా!

26-08-2025 12:50:12 AM

హీరోయిన్ మాళవిక మోహనన్‌కు మరో ఘనత దక్కింది. ఆమె ఢిల్లీలో జరిగిన ‘వీ ఉమెన్ వాంట్ కాన్ క్లేక్-2025’ వేడుకలో శక్తి అవార్డ్ సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్ ఇన్ స్టైల్ విభాగంలో మాళివక మోహనన్‌కు ఈ పురస్కారం వరించింది. ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ నేత శశిథరూర్ మాళవికకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది. శక్తి అవార్డ్ తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని తెలిపింది.

ఇక మాళవిక మోహనన్ సినిమాల విషయాకొస్తే.. ఆమె ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాజాసాబ్’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రమిదే. అంటే, మాళవిక.. పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించటం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గానే జరుగుతోందని చెప్పొచ్చు. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన ‘రాజాసాబ్’ టీజర్‌లో మాళవిక స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారులో సెగలు పుట్టించింది.