27-10-2025 01:03:13 AM
జైపూర్, అక్టోబర్26:ఈ చిత్రంలో కనిపిస్తున్న అశ్వం పేరు నగీరా. పంజాబ్‌లోని బరిండా ప్రాంతానికి చెందిన గోరాభాయ్ పెంచుకుంటున్న 31నెలల గుర్రం 63.5 అంగుళాల పొడవు ఉంది.
ఆసియాలోనే అతిపెద్దదిగా పరిగణించే రాజస్థాన్‌లో గల అజ్మేర్ సమీపంలోని పుష్కర్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ పశువుల ప్రదర్శన నగీరాను గోరాభాయ్ తీసుకురాగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే నగీరాపై రూ.55లక్షలు ఖర్చు పెట్టానని.. దీని ధర రూ.కోటి అంటూ గోరాభాయ్ ప్రకటించడంతో సందర్శకులు ఔరా అనుకున్నారు.