calender_icon.png 15 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్‌గా నల్లగొండ

15-01-2026 03:18:50 AM

  1. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
  2. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

సూర్యాపేట (నల్లగొండ), జనవ రి 14 (విజయక్రాంతి) : నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండగా తాజాగా నల్లగొండను అప్‌గ్రేడ్ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య7కు చేరనుంది. ఇప్పటికే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌లు కార్పొరేషన్‌లుగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఆ జాబితాలోకి నల్లగొండ కూడా చేరింది.

నల్లగొండను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఇటీవల శాసన సభ తీర్మానం చేసింది. ఇప్పటి వరకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ మహానగరంగా మారనుంది. కార్పొరేషన్‌గా మారడంతో ఛైర్మన్ స్థానంలో మేయర్, కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్ల ఎన్నిక నిర్వహించనున్నా రు.గెజిట్ విడుదల కావడంతో నల్లగొం డ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.