15-01-2026 03:21:03 AM
ఆలేరు, జనవరి 14 (విజయక్రాంతి): యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని బుధవారం గంగోత్రి, కాశికా పీఠాధిపతి నారాయణ మహాస్వామి శంకరాచార్యులు దర్శించుకు న్నారు. వారికి ఆలయ ప్రధాన అధికారులు స్వాగతం పలికి లడ్డూప్రసాదం అందజేశారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం దేశంలోనే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆలయ నిర్మాణశైలి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ఈ మకర సంక్రాంతిని ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకుని మరింత ఉన్నతికి ఎదగాలని కోరారు.