calender_icon.png 15 January, 2026 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు కసరత్తు

15-01-2026 03:16:05 AM

121 మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక లకు పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా బుధవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్యను ప్రకటించింది. మున్సి పాలిటీల్లో జనరల్ 30, మహిళా జనరల్ 31, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19 స్థానాలు కేటాయించారు. ఇక పది కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ మహిళ 1 స్థానాలకు కేటాయించా రు. ఈ నెల 17న రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు చేయగా, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ స్థానాలు ఖరారు చేశారు.