19-09-2025 12:00:00 AM
-తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
-జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
-బంజారాహిల్స్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18(విజయ కాంతి):గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పౌర సదుపాయాల కల్పనకు, మౌలిక వసతుల పెంపునకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రజల అవసరాలకు అను గుణంగా, క్షేత్రస్థాయి సమస్యలకు శాశ్వ త పరిష్కారం చూపే దిశగా జీహెచ్‌ఎంసీ పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టను న్న పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎన్బీటీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, ఎన్బీ నగర్, మహేశ్వరి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో నూతన తాగునీటి పైప్లైన్లు, మురుగునీటి లైన్ల పునర్నిర్మా ణం వంటి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అం దించడంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగి స్తున్నాం.
అదేవిధంగా, మురుగు నీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించి, ఎక్కడా ఇబ్బం దులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నాం అని తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలో ని జీహెచ్‌ఎంసీ పార్క్లో రూ.25 లక్షలతో నిర్మించనున్న యోగా సెంటర్ షెడ్కు శంకుస్థాపన చేసిన ఆమె, ఈ కేంద్రం స్థానిక ప్రజ ల ఆరోగ్య పరిరక్షణకు, మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.