calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపైకి నరేంద్ర మోదీ జీవితం

18-09-2025 12:10:31 AM

పలు రంగాల ప్రముఖుల జీవిత విశేషాలతో ఇప్పటికే ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నారు. ‘మా వందే’ టైటిల్‌తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బుధవారం మోదీ పుట్టినరోజు సంద ర్భంగా మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీర్‌రెడ్డి ఎం మాట్లాడుతూ.. “అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్న సాంకేతిక విలువలు, వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందే ఈ చిత్రాన్ని పాన్‌ఇండియా భాషలతోపాటు ఇంగ్లీష్‌లోనూ నిర్మిస్తున్నాం. ప్రపంచనాయకుడిగా మోదీ ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి ఉన్న అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పంచనుంది. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకాంశం” అని తెలిపారు.