calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే బ్యూటీ హీరోయిన్‌ను మార్చాం

18-09-2025 12:07:53 AM

ఏ మారుతి టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్‌పాల్‌రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేశ్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అందించగా.. జేఎస్‌ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సినిమా సంగతులివే.. “సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది.

ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి వచ్చా. ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. అందమైన ప్రేమకథ, మనసును కదిలించే భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి మధ్యతరగతి కుటుంబం చూడాల్సిన చిత్రమిది. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో ఓ వారం రోజులు షూటింగ్ చేశాం. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకు న్నాం.

ఆ హీరోయిన్ అంతగా సెట్ అవ్వడం లేదని, నీలఖిని తీసుకున్నాం. అలా షూటింగ్ వృథా అయింది. బడ్జెట్ కాస్త పెరిగింది. ఈ సినిమాను ఇప్పటివరకు చాలా మంది చూశారు. కొందరు ‘బేబీ’, ‘కోర్ట్’ స్టుల్లో ఉందని మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా అన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని పొగిడారు. ఈ మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తర్వాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.