calender_icon.png 24 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

24-12-2025 12:14:27 AM

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): రహదారి భద్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయిఅన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జనవరి 1, 2026 నుండి జనవరి 31, 2026 వరకు నిర్వహించనున్న రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వి.సి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,  జిల్లా ఎస్పీ డి. జానకి, తో కలిసి జిల్లాలోని ఆర్&బి,పోలీస్,నేషనల్ హైవేస్,ట్రాన్స్పోర్ట్,వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకు అన్ని శాఖలు బాధ్యతతో సమన్వయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రహదారి భద్రతా మాసోత్సవాలను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఉద్యమంగా నిర్వహించాలని సూచించారు.

హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై సున్నా సహనం పాటించాలని అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డి. జానకి  మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి,  అర్ధరాత్రి సమయంలో బైక్ పై ర్యాష్ డ్రైవి్ంప ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో తక్షణ వైద్య సేవలు అందేలా పోలీస్, ఆరోగ్య శాఖ, అంబులెన్స్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జడ్పీ సిఈ ఓ వెంకట్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, డీసీఆర్బీ డీఎస్పీ రమణ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.