19-12-2025 12:00:00 AM
సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 18 : ఈ నెల 21న సిద్దిపేట కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. రాజీప డదగిన సివిల్, క్రిమినల్ కేసులలో నిందితులు, ఫిర్యాదుదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. చిన్నచిన్న కేసుల తో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని , డబ్బును వృథా చేసు కోవద్దని హితవు పలికారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూ చించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని సీపీ తెలిపారు.