26-01-2026 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట ,జనవరి 25 (విజయక్రాంతి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలని, ఓటు విలువను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, డీఈఓ అశోక్, సామాజిక పర్యావరణవేత్త దుచర్ల సత్యనారాయణ, తాసిల్దార్లు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాఠశాలకళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది
ఆలేరు, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని స్థానిక సంస్థల, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి పట్టణ పుర విధులగుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కునువినియోగించు కోవాలన్నారు.
ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.