13-05-2025 12:31:03 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి) : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జరిగిన ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వెబ్ పోర్టల్ నందు శాఖల వారీగా డిపార్ట్మెంట్ ప్రొఫైల్, జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్,వార్షిక నివేదిక,శాఖ ల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలని తెలిపారు. అధికారులంతా సమన్వయం చేసుకుంటూ వేసవి లో త్రాగునీటి సమస్య లేకుండా ప్రటి ఇంటికి సరఫరా చేయాలన్నారు.
ఈ నెల 25 లోపు సంక్షేమ అధికారులు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులని పరిశీలించి, బ్యాంకు క్లియరెన్స్ ఇప్పించి లబ్దిదారులని ఎంపిక చేయాలన్నారు. ప్రజావాణిలో భూ సమస్యలకి సంబంధించి 21 దరఖాస్తులు, వివిధ ఎంపిడిఓ లకి 18 దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకి 8, పంచాయతీ రాజ్ శాఖ కి (డీపీ ఓ )4, వివిధ శాఖలకి సంబందించి 15, మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశం లో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీపీ ఓ యాదయ్య, డి డబ్ల్యూ ఓ నరసింహారావు,సీపీ ఓ కిషన్, డి ఈ ఓ అశోక్, డి యమ్ హెచ్ ఓ కోటాచలం, డి ఎ ఓ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.