28-07-2025 01:52:20 AM
జస్టిస్ బీఆర్. గవాయ్
న్యూఢిల్లీ, జూలై 27: శ్రీనగర్‌లో ఆదివారం జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) నార్త్ జోన్ రీజియన్ సమావేశంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రసగించారు. ‘హక్కులపై పౌరులకు అవగాహన లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు సామరస్యంగా జీవించే పాత కశ్మీర్‌ను పునరుద్ధరించుకోవాల్సిన అవ సరం ఉంది.
దేశంలోని పౌరులందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి న్యాయవాదిపై ఉంది. గత 35 సంవత్సరాలుగా కశ్మీర్ పరిస్థితుల్లో చాలా మార్పులు, లోపాలు తలెత్తాయి. న్యాయవ్యవస్థపై గౌరవంతో విధులు నిర్వర్తించాలి. ఎలాంటి సవాళ్లు ఎదురైనా వెనుకడగు వేయొద్దు’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను జస్టిస్ గవాయ్ కొనియాడారు.