calender_icon.png 28 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీలకు విప్

28-07-2025 01:50:50 AM

నేడు, రేపు పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ

న్యూఢిల్లీ, జూలై 27: పార్లమెంట్‌లో సోమ, మంగళవారాల్లో ‘ఆపరేషన్ సిందూర్’పై జరగబోయే చర్చకు ఎంపీలు తప్పకుండా హాజరవాలని అధికార, ప్రతిపక్ష ఎంపీలకు పార్టీలు విప్ జారీ చేశాయి. శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి సభ సజావుగా సాగేలా చూడాలని కోరారు.

ప్రధానితో పాటు పలువురు మంత్రులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై కూడా చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి