02-01-2026 12:00:00 AM
పటాన్ చెరు, జనవరి 1: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువా రం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగు చ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. పటాన్ చెరు ప్రాంతంలో రెండు జిహె చ్‌ఎంసి సర్కిల్ కార్యలయాలతో పాటు రెం డు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్దితో పాటు నూతన మున్సిపాలిటీలకు నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో రానున్న మున్సిపల్, స్థానిక ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి అత్యధిక స్థానాలను గెలవాలని నీలం మధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా అందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని నీలం సీఎంకి తెలిపారు.