calender_icon.png 12 November, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరజ్ టీ అరుదైన గౌరవం

15-12-2024 12:27:57 AM

ప్రపంచ అథ్లెటిక్స్ హెరిటేజ్ కలెక్షన్‌లో చోటు

మొనాకొ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ ధరించిన టీ ప్రపంచ అథ్లెటిక్స్ హెరిటేజ్ కలెక్షన్‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం నీరజ్ టీ మ్యుజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్‌వోడబ్ల్యూఏ)లో ఆన్‌లైన్ త్రీడీ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శనలో ఉంచారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు ప్రదర్శనతో రజతం సొంతం చేసుకున్నాడు.

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో బరిసెను 89.45 మీటర్ల దూరం విసిరి ఒలింపిక్ కెరీర్ బెస్ట్ సాధించాడు. అయితే పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు) ఒలింపిక్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. అయితే అథ్లెటిక్స్ విభాగంలో వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకాలు కొల్లగొట్టిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్ రికార్డులకెక్కాడు.