calender_icon.png 12 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయమే లక్ష్యంగా

15-12-2024 12:31:39 AM

నేడు విండీస్‌తో తొలి టీ20 

ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై ఘోర వైఫల్యంతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళల జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో నేడు ముంబై వేదికగా హర్మన్‌ప్రీత్ సేన విండీస్‌తో తొలి టీ20 ఆడనుంది. 2019 నవంబర్ నుంచి వెస్టిండీస్‌పై  భారత్ 8 టీ20 మ్యాచ్‌లు నెగ్గడం విశేషం.

విండీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా కోల్పోతే హర్మన్ స్థానంలో స్మృతి మంధానకు పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది. ఓపెనర్ షఫాలీ వర్మను ఈ సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. బ్యాటింగ్‌లో మంధాన, హర్మన్, రోడ్రిగ్స్, రిచా ఘోష్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. హైదరాబాదీ అరుంధతీ రెడ్డి ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో కెరీర్ బెస్ట్ (10 గణాంకాలు నమోదు చేసింది. మరోవైపు హేలీ మాథ్యూస్, డియాండ్రా దొతిన్, క్వియానా జోసెఫ్‌లతో విండీస్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.