calender_icon.png 12 November, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణుడిదే ఆధిపత్యం

15-12-2024 12:24:44 AM

భారత్, ఆసీస్ మూడో టెస్టు

బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదలైన మూడో టెస్టు తొలి రోజు వరుణుడు ఆధిపత్యం ప్రదర్శించాడు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఏంచుకుంది.అయితే వర్షంతో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

ఉస్మాన్ ఖవాజా (19*), మెక్‌స్వీనీ (4*) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి అంతరాయం కలిగించిన వరుణుడు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఊపందుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.  ఇక తొలిరోజు మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులకు టికెట్ డబ్బులు రీఫండ్ చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.