13-05-2025 12:49:19 AM
జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల అర్బన్, మే 12 (విజయక్రాంతి): ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యా ర్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం చేయాలనీ కోరుతూ బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అదనపు కలెక్టర్ బీఎస్ లతను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ శాతావాహన యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు, యాజమా న్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. కళాశాల కు సంబం ధించిన 6వ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర గందరగోళం ఏర్పడింద న్నారు. ఈ నెల 14 నుంచి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం, నేటికీ హాల్ టికెట్లు రాక ఇబ్బందులు ఎదుర్కోవడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నరన్నారు.
యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ మొండి ప్రవర్తన కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుందన్నారు. ఇలాంటి వైఖరి సరికాదని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోయి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో వైస్ ఛాన్సలర్ విఫలం అయ్యారని ఆరోపించారు.
ప్రభుత్వం సైతం మొండి వైఖరి విధానం కాకుండా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని యాజమా న్యాలకు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు, విద్యార్థుల పరీక్షల నిర్వహణపై పునః పరిశీలన చెయ్యాలని కోరారు.
ప్రభుత్వం, యూనివ ర్సిటీ అధికారులు తమ పంతం నెగ్గించుకు నేందుకు యాజమాన్యాలను బెదిరించడం, విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మహేష్, నాయకులు తుమ్మ గంగాధర్, బర్కం మల్లేష్, శ్రీధర్, వెంకటేశ్వర్ రావు, చింతల గంగాధర్, రిజ్వాన్, హరీష్, ప్రణయ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.