13-05-2025 12:47:52 AM
జిల్లా ఎస్పి నరసింహ
సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి): విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఏర్పాటుచేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా పోలీస్, బాల భవన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి ఉచిత శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడారు.
పిల్లలకు మేధస్సు, జ్ఞాపకశక్తి, ప్ర యోగాత్మక విధానం పెంపొందించే విధంగా ప్రయోగాత్మక ఇంటలిజెన్స్, యోగ, క్రాప్ట్, మ్యూజిక్, కర్ర సాము, సాంప్రదాయ నృత్యం, సంగీత పరికరాలు, ఇండోర్ ఆటలు మొదలగు అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరు గుతుందన్నారు. పాఠశాల పిల్లలు ఎవరైనా ఈ శిక్షణను సద్వికినియోగం చేసుకోవచ్చన్నారు.
అసాంఘిక చర్యలు, విద్యాసంస్థల్లో వేదింపులు ఇలా ఏవైనా స్థానిక పోలీస్ లకు, డయల్ 100 కు తెలపాలి అని విద్యార్థులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారనీ ఆపరేషన్ సిందూర్ ను ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసినది ఇద్దరు మహిళా అధికారులేన న్నారు.
అనంతరం రిఫ్రెష్మెంట్ కోసం పిల్లలకు పండ్లు, బిస్కెట్ అందించారు.ఈ కార్యక్రమం నందు ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణా రెడ్డి, భాల భవన్ సభ్యులు రిటైర్డ్ అధ్యాపకులు అమిధ్ ఖాన్, యోగా గురువు, జిల్లా బాల భవన్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.