calender_icon.png 22 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడిన అభ్యర్థికి అండగా ‘న్యూడెమోక్రసీ’

22-12-2025 12:45:20 AM

లక్ష రూపాయల ఆర్థిక సాయం

నూతనకల్, డిసెంబర్ 21(విజయక్రాంతి): మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పెద్దింటి రంగారెడ్డి పేర్కొన్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చిల్పకుంట్ల గ్రామం నుండి పోటీ చేసిన బత్తుల పద్మ నాగమల్లు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ప్రత్యర్థులు డబ్బు, మద్యం కుమ్మరించినా ధైర్యంగా నిలబడ్డ ఆమెకు పార్టీ అండగా నిలిచింది.

ఎన్నికల వల్ల ఆర్థికంగా నష్టపోయిన పద్మ నాగమల్లుకు, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజే శారు.రాబోయే రోజుల్లో కూటమి కార్యకర్తలకు, నాయకులకు ఏ ఆపద వచ్చినా పార్టీ వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ కార్యదర్శి దగ్గుల మల్లయ్య, దేసోజు మధు, గడ్డం శ్యామ్, భూపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.