02-10-2025 12:00:00 AM
ముకరంపురా, అక్టోబర్01(విజయక్రాంతి): మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల మైత్రి టవర్లో జయపాల్ మిత్రమండలి సభ్యులు బొల్లినేని సుజన్రావు, దువ్వంతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎలాంటి రాజకీయ పదవి లేకపోయినప్పటికి కొత్త జయపాల్ రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు.
కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయపాలన్న మిత్రమండలి సభ్యులు, జయపాల్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.గంగాధర మండలం మంగపేట గ్రా మంలో బైరి గంగారెడ్డి ఆధ్వర్యంలో జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట నరేష్, మాజీ ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పాల్గొన్నారు.అగ్రహారం హనుమాన్ దేవాలయంలో నాగారపు సత్యనారాయ ణ, గోపాల్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామం లో మాజీ ఎంపీటీసీ క్యాస జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలుజరుపుకున్నారు.