calender_icon.png 2 October, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొర్రాయిపల్లెలో సద్దుల బతుకమ్మ సంబరాలు

02-10-2025 12:00:00 AM

ముస్తాబాద్, అక్టోబర్ 01 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో బుధవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండు గ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారి, వీధుల్లో ఏర్పాటు చేసిన తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల వద్ద మహిళలు రెండు గంటల పాటు బతుకమ్మ పాటలతో కనువిందు చేశారు.

అనంతరం బతుకమ్మలను చెరువుల వద్దకు తీసుకెళ్లి వచ్చే ఏడాదికి తిరిగి రా వమ్మా అంటూ నిమజ్జనం చేశారు.కష్టాలన్ని మర్చిపోయి సంతోషంగా వెంట తీసుకెళ్లిన ఫలహారాలు ఒకరికొకరు పంచిపెట్టుకొని తినడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి సతీమణి పద్మ మహిళలు,పిల్లలు తదితరులుపాల్గొన్నారు.