22-08-2025 01:21:53 AM
యాచారం ఆగష్టు 21 :నిషేధిత జాబితా నుండి రైతుల పట్టా భూములు తొలగించి ఆన్లైన్లో రైతుల పేర్లను నమోదు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి అంజయ్య అన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కి మెమోరండం అందించారు. ఈ సందర్భంగా పి.అంజయ్య మాట్లాడుతూ.
ఫార్మ సిటికి 4 గ్రామాల 800 పట్టా రైతుల భూమి రైతుల అంగీకారం లేకుండా 2500 ఎకరాల భూమి తీసుకొని నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వం రైతులను ముప్పు తిప్పల పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిషేధిత జాబితా నుండి తీసి వేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని అన్నారు.
వెంటనే నిషేధిత జాబితా నుండి తీసివేసి రైతుల పేర్లు ఆన్లైన్ లో నమోదు చేసి ప్రభుత్వం నుండి వచ్చే అన్నిరకాల పథకాలను రైతులకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి మడ్డి సురేష్, గోవర్ధన్ ,సంజీవ, చెన్నయ్య, కుమార్,తదితరులు, పాల్గొన్నారు.