23-12-2025 12:15:12 AM
ఏటూరునాగారం, డిసెంబర్ 22(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు ఏ టూర్ నాగారం కాకులమర్రి శ్రీలత . ఆల్లవారి ఘనపురం పలక మాలక్ష్మి. చల్పాక పట్టం రాం బాబు. చిన్న బోయినపల్లి నల్ల బోయిన నాగార్జున. కొండాయి ఆలం మానస. కోయగూడా ఎ ల్లాపురం పోరిక సరిత. ముళ్ల కట్ట ఈసం జనార్ధన్. రామన్నగూడెం గద్దల నవీన్. రొయ్యూరు కావేరి అర్జున్. శంకరాజు పల్లి దేవులపల్లి విజయకుమార్. షాప్ పెళ్లి రాందేని నరసింహా మూర్తి. శివాపురం జబ్బా సరోజన.లతోపాటు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులుసో మ వారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు నూతన ప్రజాప్రతినిధులతో ప్రమాణం చేయించారు.ఈ సం దర్భంగా నూతన సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌ లిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా ముగిసింది.