21-12-2025 12:17:37 AM
దక్షిణాదికి మరో కొత్తందం దొరికేసింది. ఆ కొత్తందం పేరు మీరా రాజ్. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాకు వచ్చీ రాకతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మీరా రాజ్ గ్లామర్‌తోపాటు పాత్రలో లీనమయ్యే విధానం, భాష పట్ల చూపించే నిబద్ధత, కష్టపడే మనస్తత్వం గురించి టాలీవుడ్ ప్రత్యేకంగా చర్చించుకుంటోంది. ఈ బ్యూటీ నటిస్తున్న తాజాచిత్రం ‘సన్ ఆఫ్’ ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో మీరా తన పాత్రకు స్వయంగా ఆమే తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనప్పటికీ తెలుగు పదాలను స్పష్టంగా ఉచ్ఛరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ అమ్మడి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘కాంచన4’లో అవకాశం దక్కింది. రాఘవ లారెన్స్, పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రమిది. ఇందులో వాళ్లతో కలిసి నటించే అవకాశం దక్కడంపై మీరా రాజ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. “కాంచన4’లో స్టార్స్‌తో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కడం నాకు జీవితంలో బిగ్ ఛాన్స్.
ఈ సినిమా డైరెక్టర్ రాఘవ లారెన్స్ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నా మీద నమ్మకం ఉంచి నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చినందుకు లారెన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.