calender_icon.png 2 January, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

02-01-2026 12:00:00 AM

నిజామాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రే కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురాబత్తుని శ్రీనివాసరావు జిల్లా చైర్మన్ ఐ క్యాంప్స్, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్  ఆఫ్ బోధన్ -అయ్యప్ప సేవ చాలా సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని రాబోయే కాలంలో కూడా స్నేహ సొసైటీ ప్రారంభించబోతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సేవా కార్యక్రమాలను చేపట్టి పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సేవలను అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వయోజన దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని పునః ప్రారంభిస్తుందని, చారిటీ కంటి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు టి. వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కే పోశెట్టి, కోశాధికారి కే సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కే లక్ష్మణ్ మరియు స్నేహ సొసైటీ దివ్యంగా బాలలు సిబ్బంది మరియు స్నేహ టీఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.