calender_icon.png 30 October, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలతో భద్రాచలం మీదుగా వెళ్లే రహదారులు బంద్

29-10-2025 05:09:47 PM

భద్రాచలం నుండి మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే రహదారులు బంద్ 

భద్రాచలం (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని భద్రాచలం నుండి ఘాట్ రోడ్లో వయా మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి వెళ్లే రహదారిని బుధవారం మూసివేశారు. అదేవిధంగా భద్రాచలం నుండి వైజాగ్ వెళ్లే రహదారి సైతం భారీ వర్షాల వలన సౌకర్యానికి ఆటంకం ఏర్పడింది. మొంథా తుఫాన్ కారణంగా మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా మారేడుమిల్లి గుట్టలలో, సీలేరు గుట్టలలో భారీ వర్షాలు పడటం వలన రోడ్డుపై ఆ నీరంతా  ఘాట్ రోడ్లపై భారీగా ప్రవహించడం, పలుచోట్ల రోడ్డుపై చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు అడ్డంగా పడటంతో రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అనేక మంది ప్రయాణికులు భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు కేంద్రానికి చేరుకొని తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.