27-08-2025 01:31:23 AM
ఫిదా అయిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఆగస్టు 26(విజయక్రాంతి): జాతీ యస్థా యిలో కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నితన్య సిరి జిల్లా కలెక్టర్ రా హుల్ రాజ్ మంగళవారం తన ఛాంబర్ లో గెలిచిన మె డల్స్, సర్టిఫికెట్లతో సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం అన్నారు.
నితన్య సిరి మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ గురుకుల పాఠశాలలో కరాటే మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బో డుప్పల్ లో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతి భ చాటడం గర్వకారణం అని అన్నారు.
మెదక్ కు చెందిన నితన్య సిరి కరాటేలో సీనియర్ బ్లాక్ బెల్ట్, గరల్స్ విభాగంలో కట, వెపన్స్ విభాగంలో గోల్ మెడల్స్ సాధించి గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకోవడం, అంతేకాకుండా ఉత్తమ రెఫ్రీగా కూడా నితిన్య సిరిని నిర్వహించడం, ఇప్పటి వరకు 11 బంగారు పతకాలు, అంతర్జాతీయ బంగారు పతకాలు, రెండు చాంపియన్షిప్స్ అందుకోవడం అభినందనీయమని చెప్పారు.
ఇండి యా సీనియర్ గ్రాండ్ మాస్టర్ రవీంద్ర కుమార్ గత 8 సంవత్సరాలుగా స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి వద్ద శిక్షణ పొందినందుకు వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇండియా సీనియర్ గ్రాండ్ మాస్టర్ రవీంద్ర కుమార్, తల్లిదండ్రులు నామ కృష్ణ- కీర్తినేత పాల్గొన్నారు.