calender_icon.png 27 August, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

27-08-2025 01:29:25 AM

- మండల ఉపాధ్యక్షులు శివ ప్రసాద్ గౌడ్, 

- యూత్ మండల అధ్యక్షుడు సాయి శ్యామ్ లు 

-కార్యకర్తల కష్టాన్ని దోచుకున్నారనీ ఆరోపణలు 

-భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వెల్లడి

నంగునూరు, ఆగస్టు 26: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కాంగ్రెస్ పార్టీ మండల ఉ పాధ్యక్షులు గోనేపల్లి శివ ప్రసాద్ గౌడ్, యూత్ మండల అధ్యక్షులు గడ్డం సాయి శ్యామ్ లు పార్టీకి రాజీనామా చేసినట్లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీలో వా రికి ఎదురైన అన్యాయాలను, అసంతృప్తిని తెలిపారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పని చేశామని, నిజమైన కార్యకర్తల కష్టాన్ని నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వమని చెప్పడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రావాల్సిన సంక్షేమ ప థకాల విషయంలో అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నా, పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

అర్హులైన పేదలకు ఇందిరమ్మ గృహాలు, ఇతర పథకాలు అంద కుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్ర శ్నించిన తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే, ’కోవర్ట్’ అని ముద్ర వేయడం సిగ్గుమాలిన చర్యని విరుచుకుపడ్డారు. మండల అభివృద్ధి కోసం చక్రధర్ గౌడ్ సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశారని శివప్రసాద్ గౌడ్ తెలిపారు.

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో అధిష్టానం సహకరించక పోయినా, చక్రధర్ గౌడ్ మద్దతుతో మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షుడు గడ్డం సాయి శ్యామ్ తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక సమయంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎవరి ప్రమేయం లేదని, కమిటీలు వేయకుండా, కార్యక్రమాలు నిర్వహించకుండా తనను కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రస్తుతం ప్రజా పక్షంగా ఉండి పోరాడుతామని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో తెలియజేస్తామన్నారు.