calender_icon.png 22 November, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ సీపీ వర్సెస్ ఎమ్మెల్యే

18-08-2024 12:00:00 AM

  1. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతివ్వని సీపీ కల్మేశ్వర్ 
  2. ఆగ్రహించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  3. ఫోన్‌లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం
  4. సీఎంకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సంబురాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి మోపాల్ మండల కేంద్రంలో శనివారం రైతువేదికలో సంబురాల కోసం పోలీసు అనుమతి తీసుకున్నారు. ఈ సంబురాల్లో మోపాల్ మండలంతో పాటు రూరల్ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంబురాల అనంతరం రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

ర్యాలీకి ముం దస్తు అనుమతి తీసుకోలేదని స్థానిక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజామా బాద్ సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈలోగా మోపాల్ పోలీసులు జిల్లా అధికారులకు విషయం తెలపడంతో వారు అదనపు బలగాలను అక్కడికి పంపారు. దీంతో ఎమ్మెల్యే భూపతిరెడ్డి అదనపు బలగాలతో వచ్చిన సీఐలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌లో సీపీ కల్మేశ్వర్‌ను సంప్రదించి అనుమతివ్వాలని కోరారు.

అందుకు సీపీ నిరాకరిం చడంతో సీపీకి, ఎమ్మెల్యేకు మధ్య ఫోన్‌లోనే మాటల యుద్ధం జరిగింది.  ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ఫిర్యా దు చేశారు. అయినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో, చేసేదేమీ లేక ర్యాలీని విరమించు కున్నారు. జిల్లాలో మంత్రి లేకపోవ డంతో ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయార య్యిందని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జుపల్లి కృష్ణారావు ఉన్నా జిల్లా వ్యవహారాలు ఆయనకు పట్టవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.