18-08-2024 12:00:00 AM
అలంపూర్, ఆగస్టు 17: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన ఘటన శనివారం చోటు చేసుకుంది. కోదండపూర్ ఎస్సై స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. లిఖితారెడ్డి, అరుణ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు బైక్‌పై బయలుదేరారు. కోదండపూర్ వేముల స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు. లిఖితారెడ్డి(24)కి తీవ్ర గాయాలై అక్కడక్కడే మృతి చెందింది. అరుణ్‌కుమార్‌ను 108 అంబులెన్స్ వాహనంలో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఏపీలోని నంద్యాల జిల్లావాసి కాగా, అరుణ్‌కుమార్ కర్నూల్ జిల్లా సింగవరం గ్రామానికి చెందిన వ్యక్తి అని ఎస్సై తెలిపారు.