02-09-2025 12:00:00 AM
-జాతీయ రాజకీయాల్లో మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
-ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
-నేను కూటమి అభ్యర్థిని కాను.. ప్రతిపక్షాల అభ్యర్థిని
-ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలుగు వారందరూ ఒక తాటిపైకి వచ్చి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నీలం సంజీవరెడ్డి, వీవీ గిరి, పీవీ నరసింహరావు, జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని, ప్రస్తుతం తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండి యా కూటమి ఉపరాష్ర్టపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
సుదర్శన్‌రెడ్డి పోటీ వల్ల ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోందని ఆశాభావం వ్యక్తం చేశా రు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి, రాజ్యాంగాన్ని కాపాడాలని, రిజర్వేషన్లను కాపాడు కోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఎన్నికల్లో దిగా యని వెల్లడించారు. తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో అవకాశం వచ్చిందని, తెలుగు వారి గౌరవం పెరిగేలా తెలుగు వారందరూ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలబడాలని సూ చించారు.
సుదర్శన్‌రెడ్డి ఓటు వేయాలని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రశేఖర్ రావు, ఓవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎం పీలు, 18 మంది రాజ్యసభలకు విజ్ఞప్తి చేశా రు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయని చెప్పారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉన్నదని, ఆయన వివిధ హోదాల్లో రాజ్యం గ స్ఫూర్తితో పనిచేశారని, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్య త్వం తీసుకున్నారని, రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్లేనని, లేకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారని, నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అని, ఆ ఫిలాసఫీతో వాదించి గెలవాలి కానీ అంతం చేస్తానంటే కుదరదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.
నేను ప్రతిపక్షాల అభ్యర్థిని: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాద ని, ప్రతిపక్షాల అభ్యర్థినని ఉపరాష్ట్రపతి అ భ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూటమి లో భాగస్వామ్యం కాకపోయినా తమ మద్ద తు ఇస్తున్నట్టు చెప్పారని గుర్తు చేశారు. తా ను రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పు కొచ్చారు. అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత.. చాలా మంది రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నామని తనను అడిగారని గుర్తు చేశారు. తనకు రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని స్పష్టం చేశారు.