04-08-2025 12:00:00 AM
సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలంలో ప్రజా ప్రదర్శన, వర్ధంతి సభ
భద్రాచలం, ఆగస్టు 3 (విజయక్రాంతి):ఏ జెన్సీ ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు, వర్గ పోరాటాలు ముం దుకు తీసుకుపోవడమే సున్నం రాజయ్యకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జే రమేష్ లు పిలుపునిచ్చారు..
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 5వ వర్ధం తి సందర్భంగా భద్రాచలం పట్టణంలో పా ర్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించడం జరిగింది. ముందుగా సున్నం రా జయ్య స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మ న్ యలమంచి రవికుమార్ ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, ఎం.బి. నర్సారెడ్డి లు సున్నం రాజయ్య స్మా రక స్థూపానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు.
అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన వ ర్ధంతి సభలో నాయకులు మాట్లాడారు. భద్రాచలం నియోజకవర్గం లో మారుమూ ల గిరిజన గ్రామాలు అభివృద్ధి కోసం కా మ్రేడ్ సున్నం రాజయ్య నిరంతరం పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా బండా రు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యు లు పి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి,
నకిరికంటి నాగరాజు యు జ్యోతి, కుంజ శ్రీనివాస్,జీవనజ్యోతి,బి కుసుమ,ఎస్ అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, సండ్రా భూపేంద్ర, కొలగాని రమేష్, ఎస్..డి.ఫిరోజ్, డివైఎఫ్‌ఐ పట్ట ణ కార్యదర్శి డి సతీష్ కుమార్, అధ్యక్షులు ఆది, ప్రజానాట్యమండలి నాయకులు గౌత మి, డి మాధవరావు, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి రవీందర్, దుమ్ముగూడెం మండల నా యకులు బుల్లి సూర్యచంద్రరావు తదితరులుపాల్గొన్నారు..