calender_icon.png 27 September, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటాపై ఎవరూ కోర్టుకెళ్లొద్దు

27-09-2025 02:10:58 AM

  1. బీసీ కోటా పెంపు ఎస్సీ, ఎస్టీ కోటాకు అడ్డంకి కాదు.. 
  2. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వెనుకబడిన వర్గాల (బీసీ ల)కు 42 శాతం రిజర్వేషన్ల పెంపుతో ఎవరికీ నష్టం లేదని, కాబట్టి దయచేసి ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బీసీ కోటాతో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని స్పష్టం చేశారు. బీసీ కోటా పెంపు దేశానికి రోల్ మోడల్ కానుందని వెల్లడించారు. కోటా పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను అందరూ గౌరవించాలని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.