calender_icon.png 7 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట రాయుళ్ల అరెస్టు

07-05-2025 12:35:27 AM

జహీరాబాద్, మే 6 :జహీరాబాద్ మండల పరిధిలో  గోప్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు జహీరాబాద్ రూరల్ ప్రొబీషనరీ ఎస్త్స్ర డి.సుజిత్ తెలిపారు. కోతి కే గ్రామ శివారులో గల ఇటుక బట్టీల సమీపంలో ఏడుగురు పేకాట ఆడుతున్నట్లు  నమ్మదగిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు వారి వద్ద నుండి 7140 రూపాయలు, ఆరు మోటర్ బైక్ లను, పేక ముక్కలను ,ఏడు మొబైల్ లను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.