30-01-2026 02:14:57 AM
డాక్టర్ స్వప్న నూనె
సికింద్రాబాద్ జనవరి 29 (విజయ క్రాంతి): సాధించాలన్న కృషి, పట్టుదల ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైన లక్ష్యాన్ని అడ్డుకోలేవు అని ఓయూ నుండి పీహెచ్డీ పట్టా పొంది న డాక్టర్ స్వప్న నూనె అన్నారు. కృషి, పట్టుదల ఉంటే అనేకఅవరోధాలు, పేదరికం ఎదుర్కొని గ్రామీణ ప్రాంతం నుండి అత్యం త ప్రతిష్టాత్మకమైన వందేళ్ళ ఓయూలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, సీనియర్ ప్రొఫెసర్ వెంకటయ్య పర్యవేక్షణలో ఇంపాక్ట్ మైక్రో ఫైనా న్స్, ఎన్పవర్మెంట్, గ్రామీణ మహిళలుఅనే అంశంపై పరిశోధన పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా డాక్టర్ స్వప్న నూనె పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న నూనె మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర, దేశాల అభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు.తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు,మిత్రులకు స్వప్న నూనె కృతజ్ఞతలు తెలియజేశారు.