calender_icon.png 14 September, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు

16-12-2024 01:11:18 AM

జర్నలిస్ట్ సోదరులకు క్షమాపణ చెబుతున్నా: మోహన్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మోహన్‌బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టు సోదరు లకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.

ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. గాయం నుంచి తొం దరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు.