30-01-2026 12:20:00 AM
బడంగ్‌పేట్, జనవరి 29: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికే మాజీ సీఎం కేసీఆ్ప కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు, నోటీసుల డ్రామాలు ఆడుతోందని మహేశ్వరం నియోజకవర్గ బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిలదీశారు. అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన 420కి పైగా హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజల దృష్టిని మళ్లించడానికే ’ఫోన్ ట్యాపింగ్’ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
సిట్ అధికారుల ద్వారా కేసీఆర్కు నోటీసులు ఇప్పించడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన మండిప డ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి ’చిల్లర వేషాలు’ ఎన్నికల్లో సాగవని హెచ్చరించారు. కేసీఆర్ వెనుక తెలంగాణ సమా జం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.