22-01-2026 12:50:13 AM
మిర్యాలగూడ, జనవరి 21: ఎన్‌ఎస్పీ క్యాంప్ ఆస్తులను కాపాడాలని, కూలిపోతున్న ఆఫీసులకు కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ఎన్‌ఎస్పీ అధికారులు, ఉద్యోగస్తులు ఎన్‌ఎస్పీ అతిధి గృహం నుంచి ఎన్‌ఎస్పీ డీఈ కార్యాలయం వరకు ర్యాలి నిర్వహించి ప్రదర్శన కార్యక్రమం చేపట్టి క్వార్టర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఎస్పీ కార్యాలయం శిధిలావస్థకు చేరుకోవడంతో మార్పిడి కోసం 14-10-2025న సబ్ డివిజన్ కార్యాలయం కోసం అనుమతి ఇవ్వడంతో డీఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఇదే కార్యాలయాన్ని సబ్ కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో డీఈ కార్యాలయంలో ఉన్న సామాగ్రిని బయటవేసి వారి కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం శోషనీయమన్నారు తక్షణమే రిజిస్టర్ ఆఫీసును వేరే చోటుకు మార్చి డీఈ కార్యాలయం కొనసాగేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.
ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ సందర్శన....
రెండు శాఖల మధ్య నెలకొన్న వివాదాన్ని తెలుసుకోని బుధవారం ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ మల్లికార్జున్ రావు కార్యాలయానికి చేరుకోని ఎవరు పర్మీషన్ ఇచ్చారని అడగడం జరిగింది. దీంతో కలెక్టర్ ఆదేశాలు ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్ చెప్పడంతో ప్రస్తుతం నడుస్తున్న ఆఫీసులో మీకెలా పర్మీషన్ ఇచ్చారని నిలదీశారు. కనీసం ఉన్నతాధికారులనైనా సంప్రదించాలని, దౌర్జన్యంగా వచ్చి మా కార్యాలయ సిబ్బందిని, సామాగ్రిని బయట వేయడం సరికాదని అన్నారు. ఎన్‌ఎస్పీ ఆస్తులపై పూర్తి హక్కు డిపార్ట్మెంట్కు ఉంటుందని, ఏదైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని పరిశీలించి కేటాయించడం జరుగుతుందన్నారు. ఇట్టి విషయంపై ఈఎన్సీ ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆనంతరం వారి ఆదేశానుసారం తగు చర్యలు తీసుకుంటామన్నారు.