29-10-2025 07:18:41 PM
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. పెద్ద అంబర్‌పేట్‌లోని అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) కార్యాలయంలో లైన్ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టియన్నారంలో కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో మంజూరైన 63 కెవి ట్రాన్స్‌ఫార్మర్, కొత్త విద్యుత్ మీటర్ల మంజూరయ్యాయి.
వాటిని అమర్చేందుకు సర్వీస్ నంబర్‌లను విడుదల చేయాలని బాధితుడు లైన్ ఇన్‌స్పెక్టర్ అడిగారు. దీంతో సర్వీస్ నంబర్‌లు ఇచ్చేందుకు రూ.6 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తూ ప్రణాళిక ప్రకారం బాధితుడు లైన్ ఇన్‌స్పెక్టర్ రూ.6 వేలు లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో లైన్ ఇన్‌స్పెక్టర్ నుంచి డబ్బులను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఎసిబి కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.