29-10-2025 12:49:45 AM
ఒక పక్క ఇసుక డంపులు సీజ్
ఇంకోచోట వెలుస్తున్న కొత్త డంప్
చర్యలు తప్పవని అధికారులహెచ్చరిక
ధర్మపురి, అక్టోబర్28 (విజయక్రాంతి) ఎండపల్లిలో అధికారులు, ఇసుక అక్రమార్కుల మధ్య ఒకరకంగా అంతర్గత యుద్ధమే నడుస్తోందనీ చెప్పవచ్చు.ఒక పక్క అధికారులు అక్రమ ఇసుక నిల్వలు సీజ్ చేస్తుంటే మరోపక్క తమకేం భయం అన్నట్లు ఇసుక అక్రమార్కులు మరోపక్క ట్రాక్టర్లతో ఇసుక డంపులు నిల్వచేస్తున్నారు.
అసలేం జరుగుతుంది?
ఎండపల్లి మండలంలో సోమవారం అక్రమంగా నిల్వఉంచిన ఇసుక ట్రాక్టర్లతో పా టు,కొన్ని ఇసుక డంపులను మైనింగ్ ఏడీ జై సింగ్ సీజ్ చేసి పంచనామ నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన సోదాలు నిర్వహించగా ట్రాక్టర్లు,అక్రమ ఇసుక డంపులను ఆయన సీజ్ చేశారు.
సీజ్ చేసిన ఇసుకను పంచనామా నిర్వహించి ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలనీ ఆర్‌ఐ అన్వేష్ ను ఆదేశించారు.అక్రమ ఇసుక దందాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షేంచేది లే దనీ ఆయన స్పష్టం చేశారు. అక్రమార్కులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
ఒక పక్క సీజ్ లు, మరోపక్క డంపులు...!
అధికారులు ఒక పక్క అక్రమ ఇసుక డంపులను సీజ్ చేస్తునప్పటికీ కూడా మరో పక్కన ఇసుక మాఫియా అక్రమార్కులు ఇసుక డంపులు నిల్వ చేస్తు అధికారులకు స వాల్ విసురుతున్నారు. మీరు సీజ్ చేస్తే మేము గమ్మున ఊరకుండాలా అంటూ ఇ సుక డంపులు నిల్వ చేస్తున్నారు.ఇదంతా ఇసుక డంపులు సీజ్ అయినా కొద్ది గంటల్లోనే జరగడంతో మండల కేంద్రంలో చర్చ నీయాంషంగా మారింది.