19-09-2025 12:14:34 AM
తూప్రాన్, సెప్టెంబర్ 18 :తూప్రాన్ ము న్సిపల్ పరిధి వెంకటాపూర్ పిటి గ్రామంలోని భూమి చెరువు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండి అలుగు పోయడం జరిగింది. అయితే చెరువుకు సం బంధించిన కాలువ కబ్జాకు గురి కావడంతో వర్షపు నీరు రోడ్డుపై నుండి వెళ్లడం గమనించిన గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఇరిగేషన్ డీఈ, ఏ ఈ అక్కడికి చేరుకొని కబ్జాకు గురైన కాలువను జేసీబీ ద్వారా పునరుద్ధరించడం జరి గింది. చెరువుకు సంబంధించిన కాలువలను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ఇందులో డీఈ శ్రీకాంత్, ఏఈ అనురాధ, వర్క్ ఇన్స్పెక్టర్ కిషన్, లస్కర్స్, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.