08-11-2025 12:00:00 AM
బాల్కొండ, నవంబర్ 7 (విజయక్రాంతి): కార్తీకమాసం పునస్కరించు కొని నిజామాబాదు జిల్లా బాల్కొం డలో 524 సంవత్సరాలనుండి కొ లువై ఉన్న శ్రీ నిమిషంబ దేవి పూజ లు శుక్రవారం రోజు ఘానంగా జరిగాయి. బాల్కొండలో తొమ్మిది నల్ల రాతి ఏతైనా కొండల మధ్యన శ్రీ నిమి షాoభ ఆలయంలో నవంబర్ మొదటి శుక్రవారం ఉదయం 9 గంటలకు అమ్మ వారి అభిషేకం, పూజలు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళ మనులు అమ్మ వారికి ఒడి బియ్యలు పసుపు కుంకు మలు సమర్పించుకున్నారు.
అనంతరం అమ్మ వారికి మహా నైవేద్యం అనంతరం ప్రతి నెల మొదటి శుక్రవారం వారం అన్న దానంలో భాగం గా నవంబర్ నెల మొదటి శుక్రవా రం బ్రహ్మ రౌతు రమాదేవి గంగాధర్, హరిఖ జగదీశ్వర్, అభినయ్, మనుశ్రీ, బ్రహ్మ రౌతు మణెమ్మ, నర్సింగ్ రావు, శిరీష, శ్రవణ్ కుమా ర్, పావనిసుధ, లింబెష్, ప్రణతి నరేష్, సంయుక్త, సాత్విక, సమీక్ష కుటుంబాల వారు అన్నదానం చేసా రు. శుక్రవారం వరం రోజు జరిగిన పూజ కార్యక్రమాల్లో ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాదు, నిర్మల్, జిల్లాల నుండి భక్తులు హాజరై నారని బి. గంగాధర్, చౌదరి, బి.ఆర్.నర్సింగ్ రావు, బి. సత్యనారాయణ తెలిపారు.