14-08-2025 12:59:20 AM
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్:ఆగస్టు 13:(విజయక్రాంతి) రెడ్ అలర్ట్ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారంఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .
రానున్న మూడు రోజులు వర్షాలు మరింత కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, తాను క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపా రు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు మోటర్లు ఆన్ చేసే సమయంలో తడిచేతులతో తాకకుండా జాగ్రత్తలు పాటించాల ని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.