05-01-2026 12:54:17 AM
చెరువుల అందాలను చూసిమురిసిపోతున్న నగర ప్రజలు
సికింద్రాబాద్ జనవరి ౪ (విజయ్‌క్రాంతి): హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలౌతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలకు అంబర్పేటలోని బతుకమ్మకుం ట వేదికైతే.కొత్త సంవత్సరంలో కైట్ ఫెస్టివల్కు మరి కొన్ని చెరువులు ముస్తాబయ్యా యి. మాధాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీ లోని బమ్-రుక్న్ ఉద్ - దౌలా చెరువులు ఇప్పుడు కైట్ ఫెస్టివల్కు వేదికలయ్యాయి.
హైడ్రాతో వచ్చిన మార్పును చూసి నగర ప్రజలు మురిసిపోతున్నారు. ఆక్రమణలకు గురై చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువులు హైడ్రా చర్యలతో కొత్తగా కనిపిస్తున్నా యి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చి బతుకమ్మకుంటను చెరువును ప్రారంభించడంతో పాటు బతుకమ్మ ఉత్సవాలలో కూడా పాల్గొన్నారు. అలా వారం రోజులు బతుకమ్మ ఉత్సవాలతో బతుకమ్మకుంట అలరారింది. ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేసిన మరో మూడు చెరువులు కైట్ ఫెస్టివల్కు వేదికగా మారడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాడు మురికి కూపాలు నేడు వేడుకలకు వేదికలు
నగరంలో చెరువులు 60 శాతం వరకూ కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. మురుగు నీరు కలసి మురికి కూపాలుగా మారాయి. చెరు వు పరిసరాలకు వెళ్ళలేని పరిస్థితిని నగర ప్రజలు చూశారు. దోమలు, క్రిములు, కీటకాలతో రోగాలకు కేంద్రాలుగా మారాయి. ఇది హైడ్రా రాక ముందు పరిస్థితి. హైడ్రా వచ్చిన తర్వాత చెరువుల రూపురేఖలు మారాయి. చెరువుల అభివృద్ధి అంటే అం దాలద్దడం కాదు చెరువుల్లో పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడం కూడా ఒక భాగమే అని హైడ్రా రుజువు చేసింది.
మురుగునీటిని బయటకు తోడి పూడికను తొలగించి చెరువుల ఆక్రమణలను తొలగించింది. ఇలా వేల లారీల పూడికను తొలగించి వరద కట్టడికి నిలయాలుగా చెరువులను తీర్చిదిద్దింది హైడ్రా. చెరువుల చుట్టూ నివాస ప్రాంతాలుండడంతో చుట్టూ బండ్ నిర్మించి పా త్వేలుగా మార్చింది. పిల్లలు ఆటలాడుకునే స్థలంతో పాటు,వ్యాయామం, విరామాన్ని అందించింది.
చెరువువైపు వెళ్లడం కాదు చూడడానికి కూడా సాహసించలేని పరిస్థితి నుంచి ఇప్పడవి పర్యాటక ప్రాంతాలకుగా మారాయి. ఉదయం, సాయంత్రం వాకర్స్తో, పిల్లల ఆటలతో ఆహ్లాదకర వాతావరణం చెరువుల చెంత నెలకొంది. ఇదే ఇప్పుడు వేడుకలకు వేదికలవ్వడానికి కారణమైంది.
11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని విస్తరణకు నోచుకున్నాయి. ఆక్రమణలకు గురై 14 ఎకరాలకు కుంచించుకుపోయిన మాధాపూర్లో ని తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే కూకట్పల్లిలోని నల్ల చెరువు విస్తీర్ణాన్ని కూడా 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెంచింది. పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు తాగు నీటి అవసరాలను తర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది.
కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గు తూ హెచ్‌ఎండీఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరా లుగా మిగిలిపోయింది. ఇప్పుడీ చెరువును 17 ఎకరాలకు విస్తరించి నయనమనోహరం గా తీర్చిదిద్దింది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్కు హాజరైన పర్యావరణవేత్తలు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైడ్రాలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉండాలని అభినందించారు.
హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా తమ్మి డికుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా, నల్లచెరువులు ప్రారంభానికి సిద్ధమై కైట్ ఫెస్టివల్కు వేదికలయ్యాయి. మాధాపూర్లోని సున్నం చెరువు, ఉప్పల్లోని నల్లచెరువు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి.