calender_icon.png 2 January, 2026 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సినిమా సౌండ్ ప్రపంచమంతా వినిపించాలి

01-01-2026 12:00:00 AM

హీరో నవీన్ పొలిశెట్టి 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తు న్నారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందీ చిత్రం.

ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించిందీ చిత్రబృందం. హైదరాబాద్‌లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ పేరుతో ఏర్పాటుచేసి ఈ కార్యక్రమంలో నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి చిత్రంలోని పాటలకు వేదికపై నృత్యం చేసి ఆహూతుల్లో ఉత్సాహం నింపారు. ఈ వేడుకలో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మరో అదిరిపోయే సినిమా తీసుకొద్దామనుకున్నా. కానీ, యాక్సిడెంట్ వల్ల నేను మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ ‘అనగనగా ఒక రాజు’ కథ రాసుకున్నాం. అందరి ప్రేమతోనే ఈ సినిమా షూటింగ్‌ను సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాం. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కు వెళ్లి చూసేవాడినో.. ఆ హీరోల సినిమాలతోపాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. ఇన్ని మంచి సినిమాలతో ఈ సారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది.

తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నా” అన్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడు తూ.. “ఇది నా మూడో సంక్రాంతి సిని మా. ’అనగనగా ఒక రాజు’లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా” అని తెలిపింది.